అప్రాశ్యులు - Bhimeswara Challa (e book reading free TXT) 📗
- Author: Bhimeswara Challa
Book online «అప్రాశ్యులు - Bhimeswara Challa (e book reading free TXT) 📗». Author Bhimeswara Challa
“మీరు పెద్దవారు, లోకానుభవం కలవారు. పురుషులు, మీరింకా సంశయంలో వున్నారా? వర్షపు నాటి రాత్రి మీ ప్రశ్నకు సమాథానం నాకు లభించింది” అంది. అతను సంతోషంతో “విశాలా! నువ్వు నా దానివి” అని ఏదో అనబోతుంటే హఠాత్తుగా బలమయిన పెనుగాలివచ్చి ఆమె తల మీద కప్పుకున్న చీర చెంగును తీసి వేసింది. ఆమె వెనుక వేపు మెడ భాగంపై హఠాత్తుగా దృష్టి పడింది. క్షణకాలం అతను స్తంభించి చేతనారహితుడయిపోయాడు గుండె ఆగి. విశాల ఆది చూచి అపార్థం చేసుకుంది. తన మాటలు అతనికి నచ్చలేదేమో! తొందర పడి తన హృదయం బయట పడెనేమోనని బాధపడింది. ఏదయితే వసంతఋతువని ఆశ పడిందో అది నిజానికి వేసవి కాలమాత్రమని ఆమె ఆపోహపడింది.
చివాలున లేచి “క్షమించండి సనల్ బాబు! నావల్లనే పొరపాటు జరిగింది. తొందరపడ్డాను” అంది బాధపడుతూ.
సనల్ కి అప్పటికి తెలిసివచ్చింది. విశాల చెయ్యి పట్టుకొని తనవద్దకు ఉద్రేకంగా లాగుకొని “నీకోసం నే నేమైనా చేస్తాను విశాలా! మృత్యువును కూడా ఎదిరిస్తాను. భూమ్యాకాశాలు ఏకమైనా నేను నిన్ను వివాహం చేసుకుంటాను.” అన్నాడు పుద్రేకంతో.ఆతని తీరు, ముఖకవళికలు ఆమెను నిజంగా భయపెట్టినవి. అతని హృదయాన్ని రగిల్చి వేస్తున్న ఘోరమైన ఆవేదన ఆమె చూచాయగా కూడా గ్రహించలేక పోయింది.
అప్పటికి మసక చీకటి. నెమ్మది నెమ్మదిగా వెలుతురును శూన్యంలోకి తరిమివేసి, భూమినంతా ఆక్రమిస్తోంది. ఆమె కంగారుపడుతూ “ఇదేమిటి సనల్ బాబు! వదలండి, నాకు భయం వేస్తుంది చీకటిపడింది. పోదాంపదండి” అంది.
కానీ అతను ఇవన్నీ వినే పరిస్థితిలో లేదు. “ విశాల రేపే మన వివాహం జరిగితీరాలి” అన్నాడు
ఆమె సిగ్గుపడుతూ “అది ఎలా సాధ్యమవుతుంది చెప్పండి. వివాహం అంత సులభమైన పనా? ఇంతనంత పనయింది. అక్కడ తెల్లటి పెద్ద మచ్చ కనపడినది సుశిక్షితుడయిన సనల్ కి దాని అర్ధం క్షణంలోనే తెలిసింది. ఎంతో మంది శరీరాలపై ఆదిచూచి గుర్తుపడుతూంటారు. అదే తనవృత్తి. అందులో ఆరి తేరిన చెయ్యి అతనిది.
విశాల సనల్ పరిస్థితిని చూచి కంగారుపడింది. మాట మంతీ లేని అతని వైఖరిని చూచి కంగారుపడుతూ “ఏమిటలా చూస్తున్నారు” అని సిగ్గుపడి తిరిగి చీర చెంగు తల పైకి లాక్కొంది.
సనల్ క్షణకాలంమాత్రమే తన కర్తవ్యంమరచి ఆలోచించాడు. ఆలశ్యం చెయ్యకుండా విశాల చెయ్యి తన చెయ్యిలోకి తీసుకుని, “విశాలా నన్ను వివాహం చేసుకోగలవా? అన్నాడు. అతను ఆలోచించి ఆ క్షణంలోనే నూతనత్వానికి, ఔన్నత్యానికి మానవహృదయంలో తీవ్రమైన సంఘర్షణ జరిగింది. అతని హృదయంలో జరిగిన ఆ సంగ్రామంలో ఔన్నత్యానికి విజయంలభించింది.
విశాల గబుక్కున చెయ్విలాగుకొని “యిది మీరు అడుగవలసిన ప్రశ్న కాదు నేను ఆడగవలసినది ససల్ బాబు”అని సంతోషంతో ముఖం పైకెత్తి సనల్ కళ్ళల్లోకి చూచినది వాటిల్లో ఆమె ఊహించంది, ఆశించినది ఏకోశానా లేదు. హఠాత్తుగా వాటిల్లోంచి సంతోషం పూర్తిగా మాయమయింది దైన్నత్తం, జాలీ, ఆవేదన, ఆతృత అలసట కనపడ్డాయి. శూన్యంలోకి వేదపూరిత నేత్రాలతో వెఱ్ఱిగా చూస్తున్నాడు. త్వరగా నేను వివాహం చేసుకొంటే ప్రజలేమనుకుంటారు” అంది.
“విశాలా? ఇతరులతో మనకు నిమిత్తం లేదు. జరిగితీరవలసిందే ఇక నేను ఒక క్షణంకూడా ఆగలేను” అన్నాడు.
“రజని రాకుండా వివాహం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మా నాన్నగారు పోయిన తర్వాత ప్రపంచంలో నాకు మిగిలిన బంధువు ఆమె ఒక్కతే. ఆమెను మించిన ఆప్తులు నాకు లేరు” అంది.
“రజని శారీరకంగా ఇక్కడ లేకపోయినా ఆమె మనకు మార్గదర్శకురాలు, ఈనాటి రాత్రి ఆమె మనకు సమ్మతిని ఇచ్చినది. కాని అప్పుడు ఆమె హెచ్చరించింది. “దొరికినంత మాత్రన సంబరపడకండి. దాన్ని మానవులనుంచి, దైవాన్నుంచి పోరాడి భద్రంగా కాపాడుకోవాలంది”. మానవుల నుంచి కాపాడుకున్నాను,ఇకదైవం, అదికూడా చూస్తా” నన్నాడు.
“ఈరోజు మీరు చాలా చిత్రంగా మాట్లాడుతున్నారు. మీ మనస్సు అశాంతితో వుంది. విశ్రాంతి తీసుకోండి” అంది.
“ఇక నాకు విశ్రాంతి లేదు విశాల! మన వివాహము వెంటనే జరగాలి. రేపు కాకపోతే ఎల్లుండెనా జరగాలి నేను అందుకు కావలసిన సన్నాహాలన్నీ చేస్తాను”.
ఆమె నిట్టూర్చి “అయితే అలాగే కానీండి. ఈనాటి నుంచి నా భారమంతా మీదే” అంది.
ఆ రాత్రి సనల్ కంటికి నిద్ర లేకుండా కాలం గడిపాడు. అలాంటి భయంకరమైన పరిణామం సంభవిస్తుందని కలలో కూడా అతను అనుకోలేదు దేనినయితే జయించటానికి తన జీవితాన్నంతా వ్యయం జేసి పాటు పడుతున్నాడో, ఆదే తన ప్రాణప్రదంగా ప్రేమించే వస్తువును కబళించి, పగ సాధించటానికి ప్రయత్నిస్తూంది. దైవంకూడ దాని ప్రయత్నానికి తోడ్పడుతాడా? ఈ ప్రశ్న మాటి మాటికి అతని హృదయంలో మారు మ్రోగింది. వినోద్ ని రక్షించటానికి రజని సలిపిన పోరాటం విఫలమైంది. లేదు, అలా జరుగదు. రెండింటికి ఎంతో తేడా వుంది. నేను సనల్ ని కాదు. డాక్టరుని ఇందులో ఎంతో అనుభవముంది. ఇది చాలప్రధమదశలోనే గుర్తుపట్టాను. ఇలాంటి వారినీ ఎంతోమందిని స్వయంగా నయం చేసాను. ఇప్పటి నుంచి చికిత్స ప్రారంభిస్తే ఇంకొక రెండు నెలలలో పూర్తిగా నయమవుతుంది. సందేహం లేదు. ఈ విషయంవిశాలకు చూచాయగా తెలిసిన ఆమె వివాహనికి ఎంత మాత్రము సమ్మతించదు, వివాహము జరిగిన వెంటనే ఆమెకి ఈ విషయం తెలియపర్చాలి కాని ఆమెకు ఏ విధంగా ఈ వార్తను తెలియజేయటము? ఆమె ఎలా భరిస్తుంది! మోసగించానని నిందిస్తుందా? ఇలా మభ్య పెట్టావని కన్నీరు కారుస్తుందా? ధైర్యాన్నీ కోల్పోయి బేలయై విలపిస్తుందా? ఆలశ్యము చేయకూడదు. వెంటనే వివాహం జరగాలి. జరిగిన వెంటనే ఇది ఆమెకు తెలియ జేసి చికిత్స ప్రారంభించాలి, చికిత్స ప్రారంభించడం ఒక రోజు ఆలస్యం చేస్తే చికిత్స పూర్తి అయి ఆమె స్వస్తతకు రావడంకూడ రెండు రోజులు ఆలస్యమవుతుంది. తన శక్తినంతా వుపయోగించి ఆమెను దక్కించుకొంటా. దైవం నన్ను పరీక్షించటానికే నన్నీ అగ్ని పరీక్షకు గురి చేసాడని, ఇందులో ఏమాత్రం తడబడకూడదు.”
చాప్టర్ 15
రెండు రోజుల తర్వాత సనల్ విశాలల వివాహమైంది. రామం, ప్రసాద్, చంద్రిక, కమల, కమలాకరం మాత్రమే ఈ వివాహానికి హాజరైనారు. అందరినీ ఆశ్చర్యపరచినది ఏమిటంటే సనల్ ముఖంలో ప్రేమించి వివాహం చేసుకునే సమయంలో కనబడే సంతోషం ఏమాత్రం కనబడలేదు. విశాలకి అతని కంటతడికూడ సన్నగా కనబడింది. అది చూచి ఆమె ఎంతో బాధపడింది. అతని ప్రవర్తనకు కారణమేమి? ఆమెకు ఎంత ఆలోచించిన అర్థంకాలేదు. రెండవసారి వివాహం చేసుకుంటూంది ఇది ఎలాగు పరిణమిస్తూంది? సనల్ ఏదో భయంకరమైన ఆవేదనకు గురి అవుతున్నాడని మాత్రం ఆమె గ్రహించగలిగింది గానీ, అది ఎలాంటిదో ఎంత ఆలోచించినా ఆమెకు స్ఫురించలేదు. ఆనాడే సనల్ ని అడిగి తెలుసుకోవాలని నిశ్చయించింది. సిగ్గుని విడిచి, తనంతట తానే అడుగుతుంది తప్పేముంది? భార్యా, భర్తవద్ద యీ మాత్రం చనువు తీసుకుంటే దోష మేముంది. అదే లేకపోతే అన్యోన్యతకు ఆస్కారమేముంది. సనల్ కు తన పై వున్నప్రేమానురాగాలకు ఆమె శంకించలేదు. ఆవిధంగా ఆమె హృదయాన్ని అనుమానించడానికి కూడ ఆస్కారం లేదు. హృదయమంతా సనల్ పై వర్ణించరాని అనురాగంలో నిండి పొంగి పొర్లాడ్డానికి ప్రయత్నిస్తూంది. ఇక ఆ ప్రవాహాన్ని ఆపే శక్తి ఆమెకు కూడా లేదు. ఇక ఆనాటి నుంచి దానిని అడ్డగించే అవసరం లేదు. గట్టున తెచ్చుకుని వారిద్దరి జీవితంలోని సర్వస్వాన్నిప్రేమామృతం ముంచి వేస్తూంది. జీవితమంతా, పండు వెన్నెలలో నిండిన వసంతఋతువుగా గడచిపోతూంది సనల్ వంటి సత్పురుషుడు, సహృదయుడు, స్వారత్యాగి తనకు జీవన సహచరుడు” లభించడం తనకు అదృష్టం.
ఆనాడే విశాల తన చిన్న యిల్లు వదలి సనల్ యింటికి ఇంటి ఇల్లాలుగా వచ్చింది. శూన్యమైన ఆయిల్లు, సుఖమయంతో స్వర్గతుల్యం చెయ్యాలనే దృఢ నిశ్చయంతో ఆమె అడుగుపెట్టింది. అనాడు సాయంకాలం సనల్ అక్కడ వున్న రోగులందరికీ ఒక చిన్న పార్టీ యిచ్చేడు. వారు కాక, రామం, ప్రసాద్. కమల,కమలాకరం, చంద్రికవచ్చేరు. మిగతావారెవరిని అతను పిలువలేదు. అందరూ నూతన దంపతులని హృదయపూర్వకంగా ఆహ్వానించేరు. రోగులకది ప్రత్యేకమైన, శుభకరమైన పర్యవసానంగా పరిగణించింది. విశాల, సనల్ వీద్దరి రూపాలు వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలచిపోతాయి. వివాహ బంధనతోనే వీరు కంకణం కట్టుకోడంకన్న వారు వాంఛించేది ఏముంది. పిల్లలందరికి ఆరోజు పర్వదినం.
ఆరోజు రాత్రి వాన జోరుగా కురుస్తూంది. యడ తెరిపిలేని వాన, రివ్వున వీచిన చలిగాలి, నిశ్శబ్దాన్ని చీల్చే వురుములు, ప్రకృతిని బీభత్సంగా తయారు చేశాయి. విశాల తన గదిలో వంటరిగా కూర్చుని కిటికీలోంచి పరధ్యాన్నంగా చూస్తూంది. వాన జల్లుకి ముఖము, చీర కూడా బాగా తడిసిపోయినాయి. అయినా ఆమె అక్కడే అలాగే కూర్చునివుంది. వివాహమై మొదటి రాత్రి అది. అయినా ఆమెలో ఏదో ఒక విధమైన, వుదాసీనత్వం, జడత్వం ప్రవేశించేయి, ఏవేవో ఆలోచనలు ఆమె మెదడులో సాగుతున్నాయి. వాతావరణం అపశకునాన్ని సూచిస్తున్నాయి.
వెనుక నుంచి నెమ్మదిగా సనల్ వచ్చి వులెస్ శాలువ ఆమె బాహువులూ చుట్టూ కప్పి, విశాల యీలాగు కూర్చున్నావేమిటి! అన్నాడు. వెంటనే చేతికి తడికూడాతగిలింది. ఆరే ఇది ఏమిటివిశాల ఒళ్ళంతా తడిసిపోయింది.ఆరోగ్యాన్ని ఇక నుంచి జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్నాడు.
“సన్నని వానజల్లు ముఖానికి చల్లగా తగులుతుంటే ఎంతో ఆహ్లాదంగా వుంటుంది” అంది ముఖం చీర చెంగుతో తుడుచుకుంటూ విశాల.
“తడిగుడ్డతో తడి ముఖాన్ని తుడుచుకుంటే కూడ ఆహ్లాదంగా వుంటుందా విశాల” అన్నాడు సనల్.
విశాలకూడ నవ్వుతూ బట్టలు మార్చుకొని రావటానికి వెళ్ళింది. ఒంటరిగా కూర్చుని సనల్ ఆలోచించ మొదలుపెట్టాడు. విశాలకు భయంకరమైన ఆ వార్త తెలియ చేయడము ఎలాగ? యీ శుభసమయంలో యీ విషాదవార్త తెలియచెయ్యవలసిన కర్తవ్యాన్ని ఎలా నెరవేర్చడం? అయినా ఏమైనా యీ రాత్రే వార్తని ఆమెకు తెలియచేసి, రేపటి నుండి చికిత్స ప్రారంభించాలి. ఆలోచనలో నిమగ్నుడై సనల్ పరధ్యాన్నంగా వున్నారు. విశాల కంఠస్వరం వినపడి వులికిపడి, అటుతిరిగి చూశాడు. విశాలమయిన కురులని విరబోసుకుని పసుప్పచ్చటి చీర కట్టుకొని విశాల ఎదురుగా నిలబడి వుంది. సనల్క్షణకాలం అప్రతిభుడై రెప్ప వాల్చకుండా ఆపాదమస్తకము ఆమెను చూస్తున్నాడు, విశాల ముఖం సిగ్గుతో సిందూరమయింది.
“ఏమిటి చూస్తున్నారు? చివరకు నన్ను కూడా మీరు గుర్తుపట్టే స్థితిలో లేరా?” అంది విశాల.
“కాదు విశాల విశ్వమంతా వెదికినా నీసాటికి రాని, నీ వంటి స్త్రీని అర్ధాంగిని అయిందనేది నమ్మలేక పోతున్నాను. నిక్కచ్చిగా ఇది స్వప్నం మాత్రమే విశాలా?” అన్నాడు.
“పురుషులంతా ఇలాగే మాట్లాడతారు. పొగడ్తలతో మమ్మల్ని కవ్వించి మోసం చేస్తారు” అంది.
హఠాత్తుగా సనల్ దృష్టి విశాల మెడమీద తెల్లటి ఆమచ్చపై పడింది. ఒకసారి అతని శరీరం జలదరించింది. ఇక ఆలస్యం చెయ్యకూడదనే నిశ్చయంతో,“విశాల నీతో ఒక విషయం చెప్పే ముందు కోపగించను, నా మీద విశ్వాసం వుంచుతానని మాట యియ్యాలి” అన్నాడు.
విశాల ముఖం, క్షణకాలంలో మేఘావృతమైంది. “దేనిని అడుగుదామనుకుంటున్నారు. సనల్ బాబూ, కోపగించనని మీమీద విశ్వాసం వుంచుతానని మాటిస్తాను” అంది.
“కష్టాలు నీకేమి కొత్త కాదు విశాలా. ఈనాడు కూడా నీకు ఒకటి ఎదురయింది. ముఖ్యమైన తేడా ఒకటి వుంది. ఈనాటి నుంచి వాటిల్లో భాగస్వామి యింకొకరున్నారు” అన్నాడు.
విశాల సమాధానమేమి చెప్పలేదు. సనల్ మాటల కోసం ఊపిరిబిగించి ఎదురుచూస్తూంది. ఎంత ఆలోచించినా ఆమెకు సమాధానం దొరకలేదు.
“ఏ శత్రువునయితే మనం రాత్రింబగళ్ళు రూపు మాపటానికి నిర్విరామంగా కృషి చేస్తున్నామో ఆ శత్రువు నీలో కూడా ప్రవేశించింది. విశాలా” అన్నాడు.
ఆమెకు క్షణకాలంవరకు ఆ మాటల పూర్తిఅర్థం బోధపడలేదు. కానీ అందులో అపార్ధానికి ఆస్కారం లేదు. గొడ్డలి పెట్టులాంటి ఆ దెబ్బకు ఆమె నవనాడులు కుంగిపోయినాయి. ముఖాన కత్తి వేటుకు నేతురు చుక్క లేదు. భయవిహ్వల అయిపోయింది. స్పృహ తప్పుతుందేమోనని భయపడింది. కాని శరీర శక్తులన్నీ కూడ దీసుకొని “ఇది మీరు ఎప్పుడు కనుక్కున్నారు?” అంది.
“వివాహము చేసుకోమని నిన్ను నేనడిగేముందు” అన్నాడు.
“తెలిసివుండి మీరిలా ఎందుకు చేసారు'' అంది.
“ఇది నా కర్తవ్యంకాదా విశాలా? నీకు వివాహానికి ముందు టైఫాయిడ్ జ్వరంవస్తే నేనేమి చేస్తానో ఇప్పుడు అదే చేస్తాను. అందరికి నువ్వు ఇదే బోధించావు, కాని నా విషయంలో అన్యాయం జేస్తావా?” అన్నాడు.
సమాధానం చెప్పలేదు.
“ఎలా గుర్తుపట్టారు?” అంది విశాల.
“మెడ మీద తెల్లటి మచ్చ కనబడింది. దాని అర్ధం నీకు తెలుసు. చాలా ఎంగ్ స్టేజీలో వుందన్న మాట. రెండు నెలలలో పూర్తిగా నయమవుతుంది. ఇలాంటి కేసులన్నీఇలాగే నయమయ్యాయి. నేను నీనుంచి అర్ధించేది పూర్తి సహకారం విశాలా? దానితో నేను నిన్ను అతి త్వరలో స్వస్థతకి తీసుకువస్తాను. రేపటి నుంచే చికిత్స ప్రారంభిస్తాను. విజయం మనదే విశాలా?” అన్నాడు. ఆమె సమాధానం చెప్పలేదు. భావనారహికంగా మౌనంవహించి కూర్చుంది.
మరుసటిదినం నుంచి ఆమెకు చికిత్స ప్రారంభించాడు. కేవలం వ్యాధికి చేయవలసిన చికిత్స బహు స్వల్పమయినది. ఆమెకు కూడా తమను పీడిస్తున్న వ్యాధిసోకిందని తెలిసి రోగులంతా ఎంతో దుఃఖించారు. వివాహమైన మరునాడే ఆవిధంగా జరగటం మరింత శోక హేతువైంది, పరామర్శించి సానుభూతి చెప్పటానికి కూడా వారికి ధైర్యం చాలలేదు.
సనల్ ఇక అప్పటిలో రాత్రింబగళ్ళు ఆమెవద్ద గడుపుతున్నాడు. బలమైన ఆహారం, టానిక్కులు వేళతప్పకుండా యిస్తూ దగ్గర కూర్చునేవాడు. ఇతర రోగులయెడ తన కర్తవ్యాన్ని పూర్తిగా మరచిపోయాడు.
“ఈ ప్రపంచానికి నువ్వొక స్త్రీవి మాత్రమే విశాల కాని, నువ్వే నాకు ప్రపంచానివి. ఇక నాకు ఇంకేమి లేదు” అన్నాడు.
“విచక్షణజ్ఞానాన్ని కోల్పోయి మాట్లాడుతున్నారు సనల్ బాబూ! మీలాంటిస్వార్థత్యాగులు అనవలసిన మాటలు కావు” అంది విశాలా!
“లేదు విశాలా! నేనెప్పుడు స్వార్ధ త్యాగినని చెప్పలేదు నేను స్వార్థ త్యాగినని నువ్వొక సారంటే రజని కాదంది, నేను ఆమెతో అంగీకరించాను. పరుల సేవ నాకు మానసిక తృప్తి నివ్వగలిగింది. కాబట్టి ఆవిధంగా చేసేవాడిని అన్నాను, కాని ఇప్పుడు నీవద్దనుంటేనే నాకు అంతకన్న ఎక్కువ సుఖము, మనశ్శాంతి లభిస్తున్నాయి. అందుకని నేను దాన్ని వదలుకుంటాను. రజని అన్నదే నిజం. స్వార్థ త్యాగమనేది మానవ మనస్తత్వంలో లేదు” అన్నాడు.
“ఎంతోమంది అనాధులు, రోగులు మీ మీద ఆధారపడి వున్నారు. ఒక స్త్రీకోసం మీరు వారందరికి అన్యాయం చెయ్యటం చాలా అధర్మం. నా మనశ్శాంతికి విలువ యిచ్చి నట్లయితే ఇలాంటిపని చెయ్యకండి” అంది.
అతను వేదనతో “ఆలాగనకు, నీ మనశ్శాంతి నాకు చాలా అవసరం. నువ్వు త్వరలో స్వస్థత కావాలంటే అది చాలా అవసరం. కాని నిన్ను విడిచి క్షణకాలమైనా వుండలేను. నాశక్తికిమించిన పని. నా వద్ద మంచి ఆశించి నన్ను కష్టపెట్టకు. ఇప్పటికి నేను భరించగలిగినదంతా భరిస్తున్నాను, ఇక దీనినికూడనా వద్దనుంచి ఆశించకు” అన్నాడు.
ఆతని వేదనాపూరితమైనవాక్యాలుఆమె గుండెలలో దూసుకొనిపోయాయి. కళ్ళల్లో నీరు తిరిగింది , ఈ వుచ్చులోంచి బయటపడే మార్గమేమిటి? ఆ అనాధ బాలలను ఎవరు కనిపెట్టివుంటారు? ఈ రోగులను ఎవరు చూస్తారు? గడచిన పదిహేను రోజులలోను అంతా అల్లకల్లోలమై పోయింది. రోగులకు సరిగా వైద్యం లేదు. పిల్లలు విచ్చలవిడిగా చదువు లేకుండా తిరుగుతున్నారు. ఈవిథంగా ఇంకా కొంత కాలం గడచిందంటే ఆమె అప్పటివరకు చేసిన కృషి బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఏం చెయ్యడం! ఆ సమస్యకు పరిష్కార మేమిటి?
సనల్ అమెరికా నుంచి ఈ వ్యాధి చికిత్సతో ప్రపంచ విఖ్యాతయైన తన పాత స్నేహితుడు డాక్టరు హెన్రీని ప్రత్యేకంగా పిలిపించాడు. ఆయన వచ్చి విశాలను పరీక్ష చేయబోయాడు, ఆమెకి మొదట అది చెప్పలేదు. చివరి సమయములో చెప్పాడు. ఆమె చాలా బాధపడింది. ఆమె అంగీకరించలేదు, “అందరకులేని యీ ప్రత్యేకత నాకక్కర్లేదు సనల్ బాబూ! ఈ అన్యాయాన్ని నేను సహించలేను” అంది.
“భర్తనయిన తర్వాత నేను నా భార్యకు ఉత్తమమైనచికిత్స చేయించుకోడం అన్యాయమా? పైగా వినే వుంటావు. డాక్టర్లు తమ ప్రాణప్రదంగా జీవించేవారికి చికిత్స చేయవలసివచ్చినప్పుడు వానిని వారే నమ్మలేరు. ఇతర డాక్టర్ల చేత చికిత్స చేయిస్తారు” అన్నాడు.
“అందుకు ఇండియా దేశం కరువైపోయిందో చెప్పండి.” అన్నది.“లాభం లేదు డాక్టరుగారు.. స్త్రీ మమతలోపడి మీరు మీ కర్తవ్యాన్ని మరచిపోయారు” అని దీర్ఘంగా నిట్టూర్పు విడచింది.
ఆమె మాటలు సనల్ ని కాస్త బాధపెట్టేయి. ఆమె చెయ్యిని హృదయంవద్ద పెట్టుకొని “ఇవన్నీ ప్రాపంచిక విషయాల విశాలా! వీటినన్నిటినిమించి నీ విగ్రహమే విశాల రూపం. ఆమెను మించిన కర్తవ్యంకాని, దైవం కానీ నాకు లేదు” అన్నాడు.
ఆమె కళ్ళల్లో నీరుతిరిగింది,ప్రక్కకు ముఖం తిప్పుకొని కళ్ళు మూసుకుంది. క్షణకాలం తర్వాత కనుకొలుకుల్లో రెండు నీటిబిందువులు ఏర్పడ్డాయి. అతను ఆమె సమాధానం కోసం ఎదురుచూచి మౌనంవహించటంతో అక్కడ నుంచి లేచి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసరికి ఎదురుగుండా రామం, చంద్రిక, ప్రసాద్ కనబడ్డారు.
“డాక్టర్ ! ఇప్పుడే వార్త విన్నాము. మీరు మాటమాత్రమైనా కబురు చెయ్యలేదే?” అన్నాడు.
“విశాలతో జరిగిన సంభాషణ వల్ల అతని మనసంతా అశాంతిగావుంది. “ఏదేమైనా అంత శుభవార్త? ప్రపంచమంతాచాటుకోవటానికి రామంబాబూ!” అన్నాడునీరస కంఠస్వరంతో
ఆతని రూపం కంఠస్వరం మాటలు అందరిని ఎంతో ఆశ్చర్యపరచాయి.
“విశాల లోపల లేదా డాక్టర్ బాబూ?” అంది.
“ఉంది. కానీ నిద్రపోతోందనుకుంటాను” అన్నాడు సనల్.
విశాల ఈమాటలన్నీ వింటునేవుంది. “చంద్రికా! లోపలకు రండి” అంది. లేచి కూర్చునిప్రసాద్ ని, రామాన్ని చూచి “విచిత్రంగావుందే. మీ ముగ్గురు ఎక్కడ కలిసారు? ఇక్కడికి ఎలావచ్చారు?” అంది.
“ఏముంది విశాలా! రామానికి నా కారు క్రింద పడబోవడం అలవాటయిపోయింది. ఢిల్లీలో మొదటిసారి ఆవిధంగానే కలుసుకున్నాము. అప్పుడు రజని నా ప్రక్కన వుంది. ఈసారి కూడా ఆలాగే జరిగింది. కాని ఈ సారి చంద్రిక నా ప్రక్కన వుంది. రజని కలకత్తాలో వృద్ధదంపతుల సేవలో నిమగ్నురాలై వుంది అభాగ్యురాలు” అన్నాడు ప్రసాద్.
అసభ్యమైన ఆ మాటలు, ఆ నవ్వు ఆందరిని సిగ్గుపరచాయి. చంద్రిక అదిగమనించి“మామయ్య మాటల తీరు మీకు తెలియనిది కాదు విశాలా!మీ జబ్బు వార్త విని నేను ఎంత దుఃఖిస్తున్నాననో మాటలలో చెప్పేదానికి గాను నాకు సిగ్గు వేస్తోంది. క్రియారూపేణమీకు నేనేమైనా చెయ్యగలిగితే చెప్పండి సంతోషంతో చేస్తాను” అంది.
బరువైన హృదయంతో బాధపడుతున్న ఆమె హృదయాన్ని చంద్రిక మాటలు ఎంతో తేలికపరిచాయి.
“స్వచ్చమయిన మాటలు నా కెంతో ఓదార్పు కలిగిస్తున్నాయి చంద్రికా! నిన్నడగటానికి నాకెందుకో సందేహము కలగడం లేడు, ఇక్కడ చాలామంది అనాధపిల్లలు ఉన్నారు. ఇప్పుడు వారిని చూసేదిక్కు లేదు. నువ్వేమైనా సహాయం చెయ్యగలిగితే వారికి జెయ్యాలి” అంది.
విశాల స్మృతిపధంలో రజనీరూపం తళుక్కున మెరిసింది, ఆమెలో ఉత్సాహం వుబికివచ్చింది.
“నువ్వన్నదే నిజం చంద్రికా! రజని దగ్గర వుంటేనే నా కష్టాలన్నీ తీరిపోతాయి. ఈ భారాలన్నిటిని మోయగల వ్యక్తి రజని ఒక్కతే. మనస్సును బాధించాయి ఆస్పష్ట మయిన ఆలోచనలు, కర్తవ్యపథంకోసం అంధకారంలో కలవరపడే ఈ ఆలోచనలకి ఆమె ఒక కాంతికిరణం” అంది.
అప్పటివరకు రామం ఏమీ మాట్లాడలేదు. రజని అనే శబ్దం వుచ్ఛరించినపుడల్లా అతని హృదయం ఘల్లుమంది. విశాలనోటి వెంట రజని పొగడ్తలు విని అతని మనస్సుఆహ్లాదంతో నిండిపోయింది.
సంతోషంతో “నిజం చెప్పావు విశాలా! రజనికి యీ వార్త తెలిసిందంటే క్షణంకూడా ఆమె ఆలస్యం చెయ్యదు” అన్నాడు.
“కాని అలా చెయ్యడం ఆమెకి లాభదాయకం కాదు. ఆవృద్ధదంపతులు పరలోకం వెళ్ళేవరకు వేచివుంటే ఆమెకుసుమారు లక్షరూపాయలు జేబులో వేసుకొని తిరిగివస్తుంది” అన్నాడు ప్రసాద్.
“రజనికి సంపదమీద మోజు లేదు. ఈ వార్త తెలిసిన వెంటనే రెక్కలుకట్టుకొని వాలుతుంది. ఈ రాత్రికి నేను ఉత్తరం రాస్తాను” అన్నది చంద్రిక.
అక్కడ నుంచి సనల్ బాబు బయటకు వెళ్ళిపోవడం ఎవరు అంతవరకు గుర్తించలేదు. వ్యంగ్యంగా చిరునవ్వు వెలిగింది. విశాల ఆది చూచి దాని భావాన్ని అర్థం చేసుకోని బాధడింది. ఒకనాడు కమల అన్న మాటలు ఆమెకు గుర్తుకొచ్చాయి. “వివాహంలోని గంభీర బంధనాన్ని అర్ధం చేసుకోవాలంటే వివాహం చేసుకో విశాలా! ఆనాటి నుంచి నువ్వు సంపూర్ణత పొందుతావు. వివాహమనే తతంగాన్ని ఎంత దుయ్యపట్టినా దాని విలువని గీటు దాటకుండా గ్రహించడం కష్టం” అంది. ఆ మాటలసత్యం ఆమెకి అప్పుడు తెలిసింది. కమలని ఆమె జబ్బు చేసినదగ్గర నుంచి చూడలేదు. ఆప్పుడు ఆమెను చూడాలనే తీవ్రవాంఛ ఆమెలో చెలరేగింది.
“కమల ఈ మధ్య కనబడిందా చంద్రికా?” అన్నది. విశాల.
“కనబడింది. విశాలా? మూడు రోజులముందు వాళ్ళ యింటికి వెళ్ళాను.”
కమల పేరువిని ప్రసాద్ ముఖం అకస్మాత్తుగా గంభీరమయిపోయింది. కాని అది ఎవరు గమనించలేదు.
“కబురు పెట్టు చంద్రిక! కమలను చూడాలనీ నాకెంతో ఆభిలాషగావుంది” అన్నది విశాల.
“కమల నామాన్ని నీవు ఒంటరిగా వుచ్చరించే హక్కు నీకు లేదు” అన్నాడు ప్రసాద్.
“కమలాకరం, మీరు ఏపని వంటరిగా చెయ్యరు, వేరు వేరు వ్యక్తులయినా వారి పవర్తనలు, ఆలోచనలు ఒకటైఅన్యోన్య దంపతులు. అన్యులకు వీరిమధ్య ఆస్కారం లేదు” అంది విశాల.
మాటలు అసందర్బమయినా సహజమయినవి. కాని వాటిల్లో దాగివున్న పరిహాసాన్ని ఎవరు గుర్తించలేక పోయినారు. కమలవుంటే జవాబు చెప్పేది.
“అవును, నిజమే. అన్యోన్య దంపతులు, ఆదర్శ ప్రాయులు” అన్నది విశాల
ఆ మాటల్ని ప్రసాద్ సహించలేకపోయాడు. క్రోధం ముఖం ఎర్రబడింది. ఇక అక్కడ నిలువ లేకపోయాడు.
చివాలున
Comments (0)