bookssland.com » Fiction » క్షంతవ్యులు (Kshantavyulu) - భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa) (inspirational novels .txt) 📗

Book online «క్షంతవ్యులు (Kshantavyulu) - భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa) (inspirational novels .txt) 📗». Author భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa)



1 2 3 4 5 6 7 8 9 10 ... 18
Go to page:
క్షంతవ్యులు

క్షంతవ్యులు   

 

భీమేశ్వర చల్లా (సి.బి.రావు) 

 

Originally published by Adarsa Grandha Mandali, Vijayawada.

© 1966 C.B. Rau; Revised E-book edition @2020 Bhimeswara Challa.

అంకితము - ప్రపంచంలోని ‘క్షంతవ్యులు’ కు.

 

E-book

Cover image:                                                       

Painting of Nirmala Rau (author’s spouse)   

                                           

DTP Work

Jyothi Valaboju (writer, editor, and publisher) 

                                      

Other books by the author:                          

అప్రాశ్యులు (A novel)

                                                                             

Man’s Fate and God’s Choice

An Agenda for Human Transformation  

                               

The War Within- Betwee and Good Evil 

(Reconstructing Money, Morality, and Mortality) 

                                                

Book Blurb

 

తొలినవలని మొదటి ముద్దుతో  పోల్చడం అతిశయోక్తి కాదు.

ఈ 1956 నవల నేటి  భీమేశ్వర చల్లా నాటి సి. బి. రావు గా రచించినది.                                              

చిన్ననాటి నేస్తాలు, రామం, శశి, యుక్త వయసులో ప్రేమవలలో చిక్కుకుంటారు.  

కాని విధి వారి వివాహ బంధానికి యమ పాశం అడ్డువేయాగా రామం శశిని కోల్పోతాడు. 

చనిపోయిన ప్రియురాలిని తన ప్రేమలో సజీవింపించడం రామం జీవిత లక్ష్యం చేసుకుంటాడు.

ఆ మానసిక స్థితిలో ఉన్న అతని జీవితంలోకి యశోరాజ్యం తన ప్రేమానురాగాలతో అడుగిడుతుంది. 

ఒకవైపు శశి ప్రేమానూ మరువలేక, యశో అనురాగాన్నీ వీడలేక 'రామం బాబు' సతమత మవుతుంటే 

స్త్రీ వాది సరళ, కర్మసిధ్ధాంతి లఖియా అతని విచలిత జీవన సందిగ్ధతకు మరింత హేతుదాయకులవుతారు. 

మరొకవైపు యశో రామం సేవా సాంగత్యాలే తన ఆచలిత జీవన ధ్యేయం అని నిర్ధారించుకొని

శరత్ సాహితీ అనుభూతితో అతనిపై వెదజల్లిన ప్రేమానురాగాలు నిశ్చల ప్రేమకు నీరాజనాలు.

అనూహ్య స్త్రీపురుష ద్వందానుబంధాలు ఈ 'క్షంతవ్యులు' సారాంశం                                                       

ఈ - కమింగ్ అఫ్ ఏజ్ - పుస్తకం నవలా రచనకి అద్వితీయ నిదర్శనం.                                    

                                                                                                                                                                                                                                                                                                     

ముందుమాట  -  Foreword

                                                                                                                                                                                                                                     

Many things in this long life of mine are a kind of ‘mystery to myself’, things that cannot be rationally explainable. One of them is my venturing into the Telugu literary arena, lo, as a novelist, to pen two novels. If anything, not only their content and the characters but also the timing of the muse that occasioned that never ceases to puzzle me.

Kshantavyulu, క్షంతవ్యులు, was written in the year 1956 when I was just a 21-year old lad, freshly out of university, living in Delhi with my elder brother, preparing, entirely untutored, for the toughest competition in India. I.A.S. examination. How the idea of writing a novel germinated in my head at such a career-defining time, how the plot of a complex tale took shape with so little exposure to the raw passions and evocative emotions exhibited by the characters in that endeavour defies my imagination ‘even now’. However, I vividly remember the day I finished it; I was so relieved that I felt it did not matter if the manuscript remained unpublished or whatever might happen to my I.A.S attempt, indeed, if I lived or died that very minute.

It was altogether in a different set of circumstances of life that Aprāsyulu, అప్రాశ్యులు, followed in the year 1961, when I was the Sub-collector at Parvatipuram in Andhra Pradesh. How I summoned the zeal, drive and perseverance to write another all-consuming novel in the middle of doing a high-pressure job, as I look back, remains beyond my comprehension. Be that as it may, after I finished it, as I moved on professionally, the literary outpours of my youthful passions took a backseat in my life’s pursuits. But it was, I think in 1965, when I was the Collector of Karimnagar District, now in the Telangana State, my good friend and colleague J. Bapu Reddy, already a well-known Telugu writer by then, believed that my literary excursions were publish-worthy; so he used his good offices to get both of them published by Adarsa Grandha Mandali, Vijayawada, in 1966.

Although technically ‘published’ these books that meant so much for me once would have gone into oblivion but for the conviction of my nephew BS Murthy (Babu, as we call him) a writer himself and a ‘lover of literature’, that they deserve a permanent place in the 
e-shelf of the Telugu novels. It’s thus, he has invested an enormous amount of energy and time to bring my over sixty-year old ‘novel’ muse into the Telugu e-book world, particularly so in the rehabilitation of Kshantavyulu, క్షంతవ్యులు, for its lone tome in my bookshelf was moth eaten in good measure. So, but for Bapu Reddy these books would never have come into public gaze then and they would not have had a re-birth now but for Babu. I am deeply grateful to both of them.

Thus, after a lifetime of prolific writing in English to some critical acclaim, it is intriguing as well as heartening that, in my fading moments, my literary work in my mother tongue is getting, so to speak, posthumously resurrected.

Now it is left to the readers, whom I urge to read my following విజ్ఞప్తి in the first edition, to judge if all this effort is worth all this while.  

               

విజ్ఞప్తి

 

చిన్నతనంలో నేనూ, నా మేనకోడలూ పోటీలు వేసుకుని శరత్ సాహిత్యం వేసవి సెలవుల్లో చదివేవాళ్లం. పసి హృద‌యంలోకి శరత్ పాత్రలు శర వేగంతో చొచ్చుకుని పోయాయి. అనిర్వచనీయమైన అశాంతిని రేపినవి. ఆ పాత్రలే ఏనాడైనా నేనూ ఒక నవల రాయాలనే కోరిక నాలో వుద్భవింపజేశాయి.  అయినా చాలా కాలం వరకూ నాకు ధైర్యం చాలలేదు; అవకాశమూ రాలేదు. విద్యాభ్యాసం ముగిసి ఉద్యోగాన్వేషణ ప్రారంభించినప్పుడు కలం చేతబట్టి, కళ్లు మూసుకుని ఒకనాటి సంధ్యాసమయంలో కూర్చున్నాను. ఈ నవల అవతరించింది. నా మేనకోడలు ఈ నవల చదివి శరత్ శైలి స్పష్టంగా కనబడుతోంది అంది. అది నిజమే అయివుండవచ్చు. శరత్ సాహిత్యం నాలో జీర్ణించుకుపోయి, నాలోని భావాలనూ, ఆశయాలనూ తీర్చిదిద్దినప్పుడు నా నవలలోంచి ఆ భావాలూ, ఆ ఆశయాలూ తొంగి చూడటం క్షంతవ్యమే అనుకుంటాను!

ఈ నవల రచించి సుమారు ఏడు సంవత్సరాలైంది. దీనిని ప్రచురించాలనే ఉద్దేశం నాకెప్పుడూ లేదు. ఆత్మ సంతృప్తికి రాసినది అలాగే వుంచాలనుకున్నాను. కాని మిత్రులూ, శ్రేయోభిలాషులూ నాతో ఏకీభవించ లేదు. వారి ఒత్తిడి ఫలితంగానే ఈనాడు ఇది ప్రచురించబడుతోంది. కొన్ని నెలలక్రితం ఈ నవల తిరిగి చదువుతూంటే కొన్ని మార్పులు చేద్దామనే కోరిక కలిగింది. గత ఏడు సంవత్సరాల్లో నాలో కలిగిన అభిప్రాయాల మార్పులను నవల్లో ప్రతిబింబించేలా రాద్దామనుకున్నాను. కాని చివరకు అలా చేయడం మంచిదికాదనే నిశ్చయానికి వచ్చాను. ఆ నిర్ణయం నవల ఔన్నత్యానికే దోహదమవుతుందని ఆశిస్తున్నాను. కాకపోయినా నాచే ప్రప్రథమంగా సృష్టించ‌బ‌డిన‌ ఈ నవలను నేను విసర్జించలేను గదా!

రచయిత 

 

 

 

చాప్టర్ 1

 

                                                                     

‘జీవితంలో ఏంచేసినా నువ్వు కథలు రాయవద్దు రామం’’ అని కాలేజీలో తెలుగు మాస్టారు చెప్పినట్లు జ్ఞాప‌కం. ఆయన పండితులు. చాలా ఉద్గ్రంథాలు పఠించారు. కొన్ని పుస్తకాలు కూడా రాశారు. హరి కథలు కూడా చెప్పినట్లు గుర్తు. అందుచేత ఆయన చెప్పినది నిజమే అయివుంటుంది. అప్పుడు నేను ఆ మాటలను అట్టే పట్టించుకోలేదు. శ్రేయోభిలాషి చెప్పిన సలహా అని, భావించాను. ఈనాడు నేను ఆయన సలహాను ఉల్లంఘిస్తున్నానేమోనని భయంగా ఉంది. అయినా, నేను రాసేది కట్టుకథా కాదు, నవలా కాదు. అయితే ఏమిటది? సరైన సమాధానం నేను చెప్పలేను. కల్పన లేకుండా కథ ఉండదు. కథ లేకుండా నవల ఉండదు. ఇందులో రెండూ లేవు. ఇందులో యథార్థానికి (వాస్తవానికి) దూరములో ఉన్న విషయాలు చాలా తక్కువ.

గత జీవితాన్ని పర్యావలోకనం చేసుకోవాలనే వాంఛ ప్రతి మానవుడికి ఎప్పుడో ఒకప్పుడు కలుగుతుంది. జీవిత సంధ్యాసమయంలోని వేకువఝామున ఇది మరీ ప్రబలంగా ఉంటుంది. ఈ భూమి మీద ఇంతకాలం బ్రతికాను. నేను సాధించినదేమిటి? ఎంతమందిని దు.ఖపెట్టాను? ఎంతమందిని సుఖపెట్టాను? ఇలాంటి ప్రశ్నలు మనస్సులో మెరుపులా మెరుస్తూ ఉంటాయి. అదే కోరిక నాకు ఈనాడు కలిగింది. అయినా ఎంతో సంశయంతో, ఎంతో అనుమానంతో ఈ ప్రశ్నకి సమాధానం వెదకడం మొదలుపెట్టాను.

నా జీవితమంతా వ్యర్ధంగానే గడచిపోయింది. ఆశయంలేని జీవితానికి గమ్యస్థానం కూడా తెలియదు. పుట్టినప్పటి నుంచి, ఇప్పటివరకూ నేనొక దమ్మిడీ కష్టపడి సంపాదించలేదు. చెమటకార్చి నేనెవరినీ పోషించలేదు. చాలా కాలం ఒక స్త్రీ ధనం మీద నేను బతికాను. అది చాలా ‘హీనమైన పని’ అని చాలా మంది అంటారు. ఎందుచేత? పురుషుని ధనం మీదే  స్త్రీ ఎందుకు బతకాలి? స్త్రీ ధనం మీద పురుషుడు  ఎందుకు బతకకూడదు? ఈ ప్రశ్నలకి సమాధానం నేనెంత ఆలోచించినా నాకు దొరకలేదు. అయినా పురుషుడు స్త్రీ ధనం మీద బతకడం హీనమైనది కాకపోయినా, వాంఛనీయమైనది మాత్రం కాదు. అందరూ ఎవరి దేహాన్ని వారే పోషించుకోవాలి, స్త్రీ అయినా, పురుషుడైనా ఇతరుల మీద ఆధారపడటం వివేకవంతమైనది కాదు. అదిసరే, ‘గతాన్ని గురించి దు.ఖించి లాభమేమిటి?’ అని నిటూర్పు విడిచాను, జీవితంలోని వెన్నెలంతా తెలుగుదేశం బయటే గడిపేశాను. అందులో సగభాగం మంత్రముగ్ధునివలె ఒక స్త్రీ వెంట తిరిగాను. ఈనాడు కూడా నాకు ఆశయం లేదు. నివృత్త జీవితం నుంచి నిష్కృతిని నిరీక్షిస్తున్నాను. కాని ఆ రోజులు వేరు. నా సర్వస్వమూ ఆమె గుప్పిటిలో ఇమిడి ఉండేది. ఇంత నిరర్ధకుడి భారం ఆమె ఎందుకు వహించింది? నా కోసం ఎంతో త్యాగం చేసింది. ఆమెకు నా నుంచి తిరిగి లభించింది శూన్యం. అయినా జీవితపుటంచుల లాగే జీవితపు విలువలుకూడా మనకు తెలియవు. ఒక వ్యక్తి విలువ తక్కెడలో పెట్టి తూచగల శక్తి ఎవరికి ఉంది? ఒకరికి నిరర్ధక జీవిలా కనబడే వ్యక్తి మరొకరికి ప్రేమ పాత్రుడు, ఉత్తముడు గా కనిపిస్తాడు. సృష్టిలోని చిదంబర రహస్యమిదే.

చిన్నతనం నుంచి నేనెవరో ఒకరి ఛాయల్లోనే మెదిలాను, ఎవరో ఒకరి రక్షణలోనే బ్రతికాను, బాల్యంలో తల్లి, చిరుయవ్వనంలో సుశీ ఆ తరువాత యశో.... ఈ ముగ్గురు స్త్రీలు నా వ్యక్తిత్వాన్ని కప్పిపుచ్చారు. కాని వీరి ముగ్గిరి కన్నా మిన్నగా ఇంకొకరి రూపం నా హృద‌యంలో హత్తుకుపోయింది. ఆమే లఖియా, పవిత్ర అనురాగం దాన్ని భూమిమీద నడిచే ఏ స్త్రీ కైనా జతచేయ దలచుకొందేమో నన్నట్లు వుందీమె. ఇక సరళ సంగతి, అందరిలోకి ఆమెకే నేను అన్యాయం చేశాననిపిస్తోంది. ఆమెను నేనుఈ నాటికి అర్ధం చేసుకోలేక పోయాను. హృద‌యాంతరాళంలో ఆమె నన్ను ఏ విధంగా భావించేదో నేను ఎన్నడూ తెలుసుకోలేక పోయాను. ఇక సుజాత, ఆమె కథ విన్నాను. కాని ఎప్పుడూ కలుసుకోలేదు. నల్లటి అందమైన యువతులు కనబడితే స్మృతిపథంలో తళుక్కున ఒక సారి మెరుస్తుంది. ప్రమీలను కూడా నేను ఎప్పుడూ చూడలేదు. అయినా చివరకు నా జీవితవిధానాన్ని మార్చే ప్రయత్నంలో ఆమె ఎంతో తోడ్పడింది. ఇక మిగిలింది సురేఖ, అపరిచిత బాటసారులుగా వెళ్లి ఆమె ఆతిధ్యాన్ని ఆరాత్రి మేము స్వీకరించాము. ఆ తర్వాత కొన్నాళ్లు ఆమె సాంగత్యము లభించింది. కోరిన  ప్రియుడిని వివాహము చేసుకోగలిగింది.

ఇంకోమాట, నవల రాయడం బొత్తిగా చేతకాదని ముందరే చెప్పాను. నేను రాసేది నవల కాదు, అని నన్ను నేను మభ్యపరుచుకొంటూ దీనిని మొదలుపెట్టాను. నవల దృష్టితో చూస్తే ఇందులో చాలా లోపాలుంటాయి. అయినా నిజం కల్పనకన్నా ఎప్పుడూ మంచిదనే నమ్మకంతో ముందుకు సాగిపోతాను. తెలుగు మాస్టారుని తలచుకొంటూ.

నా ఎనిమిదవ ఏట నేను, నా తల్లిదండ్రులు మద్రాసు వెళ్లాం. అనేకమందిని కోల్పోయిన తర్వాత నేనే వారిద్దరికి మిగిలింది. అందుకని తల్లిదండ్రులకి నేనంటే పంచప్రాణాలు. ముఖ్యంగా మా అమ్మకి ఇక వేరేపని ఉండేదికాదు. మద్రాసులోనే రెండు సంవత్సరాలు వుండి పోయాము. ఎగ్మూరులోని మాయింటి పక్క ఓ ప్లీడరు గారు ఉండేవారు. ఆయన కూడా మాలాగే ఆంధ్రుడు. మా కుటుంబానికి ఆయన కుటుంబానికి చాలా దోస్తీ. ఆయన పదేళ్ల కూతురు సుశీల, నేను ఒకే క్లాసు చదివేవాళ్లం. నేను ఆ ఊరికి కొత్తకనుక నన్ను స్కూలుకు తీసుకెళ్లి ఇంటికి తిరిగి తీసుకొచ్చే పూచీ మా నాన్నగారు సుశీ పెట్టదలచారు. మొదటి సారి నేను వాళ్లయింటికి వెళ్లినప్పుడు వాళ్ల నాన్న గారు నన్ను సుశీ దగ్గరకు తీసుకెళ్లి ‘‘సుశీ నీకు ఒక కొత్త స్నేహితుడు వచ్చాడు,’’ అంటూ పరిచయం చేశారు.

సుశీ కొంచెము బొద్దుగా, నాకంటే బాగా పొట్టిగావుంది. (అప్పటి సుశీ ఫోటో ఇంకా నావద్ద వుంది) పరికిణీకట్టుకొని బుద్ధిగా కూర్చుని బయటికి పాఠాలు చదువుకొంటూవుంది. మేము లోపలికి వచ్చినవెంటనే లేచి నుంచుంది. తండ్రి చెప్పిన మాటలు విని నా ముఖం కేసి తదేకంగా చూసింది. నాకు అంతకుముందు ఆడపిల్లలతో స్నేహం లేదు. అక్క చెళ్లెళ్లు కూడా లేరు. స్త్రీ జాతినంతను మా అమ్మతో ఏకం చేసేవాడిని. ఇంకే ఇతర స్త్రీ ఏ అంతస్తులోనూ నావూహలోలేదు. పసివాడినైనా ఎందుకో ఆమె కళ్లు నాలోని సిగ్గుని బయటకి తెచ్చాయి. నాకంటే పొట్టిగావున్న ఆమె నాకంటె చాలా పెద్దదానిలా కనబడింది. ఏంచేయాలో అర్ధంకాలేదు. కళ్లు క్రిందికి దించేసుకుని ఆ గదిలోంచి బయటకు పారిపోదామని ఆలోచిస్తున్నాను. నా పరిస్థితి చూచి జాలికలిగిందని, ఒక విధమైన మాతృప్రేమ‌ పెల్లుబికిందని సుశీ నాకు తర్వాత చెప్పింది. ఆటలు ఆడుకునే సమయంలో బొమ్మలికి తల్లిగా నటించినట్లే తన కళ్లలోకి చూడటానికి భయపడుతున్న ఆ అబ్బాయిని కూడా బుజ్జగించాలనే కోరిక కలిగిందట.

‘‘నీ పేరేంటి?’’ అంది నా దగ్గరకు వచ్చి నా కళ్లలోకి చూస్తూ...

ఇంకా ఆ కళ్లలోకి చూడలేకపోయాను.

“రామం,” అన్నాను నేలకేసిచూస్తూ.

‘‘నా పేరు సుశీ... సుశీల,’’ అంది నా చెయ్యి పట్టుకుంటూ.

‘‘సుశీ . రామం నీతో స్కూలుకి వస్తాడు జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకురావాలి,’’ అన్నాడు సుశీ తండ్రి.

సుశీ ఆయన మాటలను విన్నా, వాటికి సమాధానం చెప్పలేదు.

నా చెయ్యి పట్టుకుని ‘‘నువ్వు నాకన్నా పెద్దవాడివా? చిన్నవాడివా?’’ అంది.

‘‘అది రామానికెలా తెలుస్తుంది. సుశీ . నీకెన్నేళ్లో చెప్పలేదు కదా నువ్వు?’’ అన్నారు ఆయన నవ్వుతూ.

‘‘నాకు పదేళ్లు,’’ అంది సుశీ, ఆమె చేతిలో నాచెయ్యి అలాగేవుంది.

‘‘నాకు ఎన్నేళ్లో నాకు తెలియదు. మా అమ్మ నాకు చెప్పలేదు,’’ అన్నాను నెమ్మదిగా నాచెయ్యి విడదీస్తూ.

‘‘నాకంటె పొడుగ్గా వున్నావు, నా కంటే పెద్దవాడివే అయి వుంటావు,’’ అంది నా దగ్గర అలాగే నుంచుని.

‘‘సరే ఇక పద రామం, మీ ఇంటికి వెళ్దాం, రేపు స్కూలుకు వెళ్లేముందు సుశీ మీ ఇంటికి వస్తుంది,’’  అన్నారు సుశీ నాన్నగారు.

ఆయనతో నేను బయటికి వచ్చేశాను. సుశీ కూడా మా వెంట  వచ్చింది.  

ఆ విధంగా నాటుకున్న విత్తనం క్రమక్రమంగా పెరిగి పెద్దదయింది. స్కూలుకి కలిసి వెళ్లేవాళ్లం. కలిసి తిరిగి వచ్చేవాళ్లం. స్కూలులో కూడా ఒకే క్లాసులో ఉండేవాళ్లం, పక్కపక్కన ఇళ్లు కనుక ఇతర సమయాల్లో కూడా కలిసే ఉండేవాళ్లం, మొదటి నుంచి సుశీ నామీద అధికారం చెలాయించేది. స్కూలులో తోటి పిల్లలవద్ద ఎప్పుడూ నన్ను వెనకేసుకుని వచ్చేది. ఏమైనా అల్లరిపని చేస్తే మాష్టారి కంటె ఎక్కువగా సుశే నన్ను మందలించేది. అది నాకేమంత కష్టమనిపించేది కాదు. స్వతంత్రంగా నేను ఎప్పుడూ జీవించలేదు. ఇంటి దగ్గర మా అమ్మ, బయట సుశీ వీరిద్దరూ నన్ను పరిపాలించేవారు. మేము ఒకరిని విడిచి ఒకరం ఒక్కరోజైనా ఉండలేదు. అసలు అలాంటి అవసరమే రాలేదు. ఈ విధంగా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి, ఇక మద్రాసుని, సుశీనీ వదలవలిసిన సమయం అసన్నమైంది. ఆ మాట విని సుశీ ఏడ్చింది. గోలచేసింది. కాని ఆ చిన్న పిల్లమాట వినేదెవరు? నేనూ ఏడ్చాను, కాని నా ఏడుపు మా నాన్న గారి పేకబెత్తంతో పటాపంచలైంది. మేము మాఊరు వచ్చేశాము. మొదట్లో కొన్నాళ్లు అస్తమానమూ సుశీ జ్ఞప్తికి వచ్చేది. తర్వాత సుశీని క్రమ క్రమంగా మరచిపోయాను.

పద్ధెనిమిది సంవత్సరములయ్యే నాటికి సుశీ ఒక స్మృతిగా మిగిలిపోయింది. ఆమెది ‘అప్పటి’ ఫొటోని బయటికి తీసి అప్పుడప్పుడు చూస్తూ ఉండేవాడిని.

అవి నేను ఆంధ్రా యూనివర్సిటీలో ఆనర్సు చదివే రోజులు. నేను ఊరిలో ఒంటరిగా బస చేసేవాడిని. కాలేజీ తెరచిన రెండు నెలలకి ఒక అందమైన అమ్మాయి నా క్లాసులో చేరింది. ఆ రోజు సాయంత్రం నేను లాడ్జికి తిరిగి వస్తూవుంటే వెనుకనుంచి ఎవరో పిలుస్తన్నట్టయి వెనుదిరిగి చూశాను. ఆమే కొత్త అమ్మాయి, ఆగమని చేత్తో సంజ్ఙ‌ చేసేంది.

 ‘‘క్షమించండి. నేను మీ క్లాసుమేట్ని, మీ ఫిజిక్సు నోట్సు ఓ సారి ఇవ్వగలరా?’’ అంది నా దగ్గరకు వచ్చి.

నేనుఒక అపరిచిత కాలేజీ యువతితో మాట్లాడటం అదే మొదటిసారి. సుశీని వదలిన తర్వాత ఇంకెవరి సహవాసము నాకు లభించలేదు.

‘‘నా రైటింగ్ బావుండదండీ, ఇంకెవరినైనా అడగండి,’’ అన్నాను కాస్త తడబడుతూ.

‘‘ఫర్వాలేదు మీదే ఇవ్వండి,’’ అంది.

“కానీ అది నావద్ద లేదండి,” అన్నాను ఎలాగైనా తప్పించుకుందామని.

అయినా ఆమె నన్ను వదలలేదు,

‘‘మీతో మీ లాడ్జికి వస్తాను పదండి,’’ అంది.

ముక్కూ మొగము తెలియని నాతో లాడ్జికి వస్తానన్న ఆమె మీద ఏహ్యాభావం కలిగిన మాట దాచటం అనవసరమనుకుంటాను. అయినా ఇప్పుడు నన్ను నేను ప్రశ్నించుకుంటాను, ‘అందులో తప్పేముంది? నలుగురు అలా అనుకుంటారని అర్థంలేకుండా నేనుకూడా అలా ఎందుకు భావించాను?’

‘‘ఎందుకు మీకింత శ్రమ? నేను రేపు క్లాసుకి తీసుకొస్తాను వెళ్లండి,’’ అన్నాను.

‘‘మీతో కాస్త మాట్లాడాల్సిన పనివుందండి. మీరొక్కరేనా రూములో ఉంటున్నది?” అంది కాసేపు నన్ను పరిశీలనగా చూచి,

“ఔనండి,” అన్నాను.

“మీకభ్యంతరం లేకపోతే మీతో వస్తాను,” అంది.

అభ్యంతరం వున్నా అడ్డు ఎలా చెప్తాను? నాతో రూముకు వచ్చింది.  

తీరికగా కూర్చుని, “మీ పేరు తెలుసుకోవచ్చాండీ?’’ అని అడిగింది, చెప్పాను. “మీ తండ్రిగారి పేరు?’’ అదీ  చెప్పాను. ఊరి పేరు సైతం అడగ్గా అదీ చెప్పాను. ఇంతలో ఆమె దృష్టి గోడకు తగిలించివున్న సుశీ చిన్ననాటి ఫొటో మీద పడింది. నా కేసి చూసి తిరిగి ‘‘నేను ఎవరో గుర్తుపట్టలేదా రామం?’’ అంది.

ఆమె సుశీ ఫోటోకేసి చూడటం, అలా అడగటాన్ని గ్రహించి ‘సుశీ’ అన్నాను. సుశీ కిలకిలా నవ్వి ‘రామం’ అంది. సుశీ స్వతహాగా అందగత్తె అని నాకు తెలుసు. కానీ ఇంత అందంగా తయారవుతుందని నేను ఊహించలేదు. స్త్రీలు యవ్వన ప్రవేశానంతరం గుర్తుపట్టలేనంతగా మారిపోతారు. సన్నగా, పొడుగ్గా, నాజూగ్గా ఉంది. అంతా మరిచిపోయి ఆమెకేసి తేరిపార చూస్తున్నాను.

‘‘అలా చూస్తావేంటి రామం? అపరిచిత  వ్యక్తిలా?’’ అంది సిగ్గుతో కళ్లు క్రిందకు దించుకుని.

‘‘నువ్వే ఆ సుశీవంటే నమ్మలేకపోతున్నాను. చాలా మారిపోయావు,’’ అన్నాను  ఆశ్చర్యంగా. 

‘‘మీరూ మారిపోయారు. అయినా క్లాసులో చూసినప్పుడే అనుమానం వేసింది. అందుకే మీ వెంట వచ్చాను,’’ అంది.

 

 

చాప్టర్ 2

                                    

 

కొన్ని కొన్ని సంఘటనలు, ముఖ్యంగా మనమెన్నడూ ఆశించననవి, జీవిత కాలక్రమాన్నే మార్చేస్తాయి. తిన్నగా సాఫిగా సాగుతూన్న జీవితపు బాట వక్రమార్గాలు తొక్కుతుంది. దీనికి కారణం వెతకటం అవివేకమూ, అవాంఛనీయమూ కూడాను. లోకాన్ని చూసిన

1 2 3 4 5 6 7 8 9 10 ... 18
Go to page:

Free e-book «క్షంతవ్యులు (Kshantavyulu) - భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa) (inspirational novels .txt) 📗» - read online now

Comments (0)

There are no comments yet. You can be the first!
Add a comment