క్షంతవ్యులు (Kshantavyulu) - భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa) (inspirational novels .txt) 📗
Book online «క్షంతవ్యులు (Kshantavyulu) - భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa) (inspirational novels .txt) 📗». Author భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa)
ఒక్కొక్క చోట పది పదిహేను రోజులు వుండిపోయేవాళ్లం. చేసిన యాత్రలు చాలు ఇంటికి పోదాం అని నేను, వెళ్లి చేసేదేముంది చెప్పండి అని యశో, ఇదే వరస మాది ఆ రోజుల్లో.
ఆవిధంగా తిరిగి తిరిగి కాశీ చేరుకున్నామోలేదో, దక్షిణాది క్షేత్రాలు చూడటానికి బయల్దేరుదామంది. నేను అంత తొందరగా వద్దన్నాను. తిరిగి తిరిగి ఎంతో అలసిపోయాను. రైలు ప్రయాణ మంటేనే విసుగెత్తి పోయింది. అయినా యశో పంతం మీద వెళ్లక తప్పలేదు. జ్ఞానం వచ్చిన తర్వాత తెలుగునాడు ఎప్పుడూ చూడలేదట. మాతృభూమి చూడాలని కోరికగా వుందంది. మళ్లీ రైలెక్కాము. తిరుగుడికి అంతేముంది?
చాప్టర్ 28
జీవితంలో నాకొక ఆశయం లేదు. యశో వద్ద నాకు కావాల్సిన ఆదరం, అనురాగం, రక్షణా లభించాయి. నా భారమంతా ఆమే మోస్తోంది. వీటన్నింటినీ నేనెందుకు కాలదన్నాలి? ఎదురీత చేతకాన్నప్పుడు ప్రవాహంలోపడి కొట్టుకుపోవుటే ఉచితం. అదే చేశాను. అనేక పుణ్యక్షేత్రాలు తిరగాము. అప్పుడు మేము తిరుపతి నుంచి అన్నవరం వెళ్తున్నాము. దారిలో రాజమండ్రి స్టేషన్ తగులుతుంది.
“మీ ఊరు తీసుగెళ్ళి మన ఇల్లు చూపించండి. పగటి పూట ఇబ్బందనుకుంటే రాత్రి వేళయినా సరే,’’ అంది యశో.
నేను ఇల్లు వదిలిపెట్టి వచ్చినప్పటి నుంచీ పొలంతో పాటు ఇంటి వ్యవహారం కూడా బాబయ్యే చూస్తున్నాడు. ఇల్లు ఎవరికో అద్దెకిచ్చానని ఒకసారి రాశాడు. దానిమీద వచ్చిన అద్దె, భూముల మీద వచ్చిన శిస్తు కలిపి అప్పుడప్పుడు పంపిస్తూ వుండేవాడు. నేను ఏదో దేశ సంచారం చేస్తున్నానని ఆయన అభిప్రాయం. నాతోటి ఒక స్త్రీ కూడా వుందని తెలిస్తే ఆయన ముఖం మీద ఉమ్మివేస్తాడు. ఇక ఆయన ద్వితీయ కళత్రం లలితాదేవి సంగతి చెప్పక్కర్లేదు. పురాతన స్త్రీ మాత్రమే కాదామె. అంతకంటే అందకత్తె మా కుటుంబంలో ఎక్కడా లేదని ఆమె గర్వం. యశోని చూసిందంటే ఆమె ఈర్ష్యతో మండి పడుతుంది. అదీకాక యశోని ఏమని పరిచయం చేస్తాను? నేను మాట దాటేస్తే మాత్రం ఎవరూరు కుంటారు, తనెవరని అడగారూ? నేనేమి చెప్పగలను? అందరూ నన్ను వేలెట్టి చూపిస్తారు అదీకాక ఆమె నెవరయినా అవమానపరిస్తే? తాను బాధపడడం మాట అటుంచి అది నేనెల్లా సహించగలను? ఏతావాతా తన్ని అప్పుడు మా ఇంటికి తీసుకెళ్ళడం శుద్ధ అవివేకం.
కానీ ఆమె కోరిక సమంజసమైంది. తన ఇల్లు తనకు చూపించమంటూంది. స్వర్గస్తులయిన నా తల్లిదండ్రుల ఆశీర్వాదం ఆమెకు ఎలానూ లభించదు, ఇక వారి ఇల్లైనా చూపించలేనా? ఆమె కోరికను ఎలా నిరాకరించగలను? దారిలో రాజమండ్రి ఎలాగా తగులుతుంది. సరే రాత్రి మమల్ని ఎవరూ చూడరు కదా. ఒకసారి చూపించుదామని నిశ్చయించాను.
అల్లాగ ఆరోజు రాత్రి తొమ్మిది గంటలకు రాజమండ్రి స్టేషనులో సామాను వదిలి, మేమిద్దరం రిక్షాలో ఇన్నీసుపేట చేరాము. ఇల్లు కొంచెం దూరంలో ఉందనగా రిక్షా దిగి అక్కడికి నడచి వెళ్ళాము. వీధి తలుపు వేసివున్నా ఇంట్లో దీపాలున్నాయి. ఇంటి అరుగు దగ్గర ఆగి మాఇంటికి నేనే గైడ్ అయ్యాను.
‘ఇదే నా పుట్టినిల్లు. ఆ యడమవైపు గదిలోనే రోహిణీ నక్షత్రంలో పుట్టానని మా అమ్మ చెప్పేది. నా బాల్య స్మృతులతో నిండివుందీ ఇల్లు,” చెప్పేను యశోతో.
"నే లోపల అడుగు పెడితే అవుతుందిగా నామెట్టినిల్లు, " అంది యశో తనలో తానుగా.
యశోని ఇంటి వరకు తీసుకకెళ్లేను గాని గృహప్రవేశం ఎలా సాధ్యం? అదే అన్నాను తనతో.
నా ఇంట్లోకెళ్ళి అద్దెకున్న వారితో కూడా నేనెవరినో చెప్పుకునే ధైర్యం నాకులేదు. నేను చేసిన దోషమేమిటి? తల్లిదండ్రులు జీవించివుంటే ఎంతో సంతోషించేవారు. యశోని చూస్తే మా అమ్మ హృదయం కరిగి యుండేది. ‘చక్కటి రూపమమ్మా నీది. బంగారపు బొమ్మలావున్నావు. మా తోటికోడలు పొగరు అణుస్తావు నువ్వు. పద ఇప్పుడే ఆమెకు చూపిస్తా’ అనేదేమో. యశో చాలాసేపు ఇంటివైపు చూస్తూ నించుంది. ఆమె మదిలో సాగుతున్న ఆలోచనలేమిటి?
“ఈ ఇంటికి యజమానురాలినయినా రాత్రి వేళ దొంగలా బయట నిలపడి లోపటికి దూరడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను. ఇంతకంటే దౌర్భాగ్యంవేరొకటుంటుందా?” ’’అంది యశో దీర్ఘంగా నిట్టూర్చి.
"అమ్మీ తెలుసుకో, నీ ఆవేదనలోని ఆప్యాయతే నా ఆయువు," అన్నాను ఆమె భజం మీద చేయి ఉంచి.
“అది తెలుసుకానీ, మన ఇంట్లోకి దారి తీయండి,” అంది యశో భావగర్భి తంగా.
‘‘అది ఎలా సాధ్యం,’’ అన్నాను.
‘‘బాటసారులమని చెప్పి మంచి నీళ్లు అడుగుదాం,’’ అంది హుషారుగా.
‘‘నీ కేమయినా మతి పోయిందా అమ్మీ, రాత్రి వేళ మంచినీళ్లేమిటి?’’ అన్నాను.
‘‘రాత్రి దాహమేయదా ఏమిటి, కాదనకండి ఏ ట్రయల్ కాస్ట్స్ నథింగ్,’’ అంది నా చెయ్యి పట్టుకు లాక్కెళుతూ.
‘‘ఎవరు?’’ తలుపు తట్టగా ఒక ముసలాయన వేసిన ప్రశ్న.
"మీ పక్కింటివారి బంధువుల మండి, ఇప్పుడే ట్రైన్ దిగి వచ్చాము, తీరాచూస్తే తలుపు తాళమేసివుంది," అన్నాను ఈలోపున నేను ఆవిషయం గమనించి.
"అలాగా, లోపలకు రండి, అనుకోకుండా పొద్దున్నే వాళ్ళు కాకినాడ వెళ్ళేరు," అన్నాడాయన.
యశో ప్రశంశా నేత్రాల మెరుపు నా మదినెన్నడు వీడలేదనడం అతిశయయోక్తం కాదు.
“సురేఖా, ఒకమారు ఇల్లారా, మీ శాంతా వాళ్ళింటికి ఎవరో వచ్చారు," అరిచాడాయన.
"తాతా, ఉదయమేగా వాళ్ళు ఊరెళ్లింది, పాపం వీళ్ళకు తెలియదేమో," అంటూ వచ్చింది పదహారేళ్ల సురేఖ.
"మిమ్మల్నివేళ కాని వేళ వచ్చి ఇబందిపెట్టడం సబాబు కాదని తెలుసు మాకు - ఈయన మా ఆయన బాదల్ బాబు , నేనాయని భార్య యశోరాజ్యం – కాని.. " అంది యశో సురేఖ దగ్గరకు వెళ్లి.
"భలే విచిత్రంగా మాట్లాడుతావు అక్కా, అయినా నా స్నేహితురాలి బంధువులు మా బంధువులేగా,"
అంది సురేఖ.
"బలే భేషుగ్గా చెప్పేవే మానవరాలా, వీళ్లకు వాళ్ళొచ్చేవరకు ఇక్కడే బస ఏర్పాటు చెయ్యి," అన్నాడాయన.
"నా ఊహకి, సహృదయుల నివాసమే నిజమైన దేవాలయం, అందులో నువ్వు నన్నుఅక్క అన్నావు కనుక నిన్ను ఎల్లప్పుడూ చెల్లిగానే భావిస్తాను," అంది యశో సురేఖ చేయిని తనచేతిలో తీసుకుని.
“బాబు గారూ, మీ సహృదయత కి మా ధన్యవాదాలు, ఈ రాత్రి తల దాచుకోడానికి చోటిస్తే చాలు, మేము తెల్లారకట్టే అన్నవరం అన్నవరం వెళ్లే ట్రైన్ పట్టుగొవాలి. అందుచేతే సామానంతా క్లోక్ రూమ్లో పడే సోచ్చ్చాము." అన్నాను.
“'సరే, దంపతులారా, క్షేమంగా వెళ్లి లాభంగా రండి. మీ పడక ఏర్పాట్లు అవీ మా సురేఖ చూస్తుంది. నేవెళ్లి పడు కుంటాను తొందరగా లేవాలికదా," అన్నారాయన.
"ఒక వేళ మాకు మెలుకువ రాక పోతే మమ్మల్ని లేపండి బాబుగారు," అంది యశో.
"అల్లాగే నమ్మా కోడలా," అని ఆయన తన గదిలోకి నిస్ష్క్రమించేరు.
‘‘కూర్చోండి, మీకు ఏవైనా పళ్ళు తీసుగొస్తాను," అని, వద్దన్నావినకుండా సురేఖ లోపలికి వెళ్ళింది.
గోడమీద పెద్ద ఫ్రేమ్లో వున్న మధ్యవయస్సు దంపతుల ఫోటోచూసి, యశో నాకేసి భావపూరితంగా
చూస్తే, నేను తన చెయ్యి పట్టుగుని నాతల్లితండ్రుల ఆశీర్వాదాలకు వారి దగ్గరకు తీసుకెళ్ళేను.
యశో ఆసక్తికరంగా వారిరువురి కేసీ చూసి, వారికి వంగి నమస్కరించిం అంది, "మీవన్నీ అత్తగారి పోలికలు."
"అయితే అదృష్ట మంటారుగా, అందుకే నువు దొరికావు," అన్నాను.
"ఏమిటి చూస్తున్నారు, ఈ యిల్లు ఆ స్వర్గీయ దంపతులది. మంచివారని అంటుంటారు," అంది సురేఖ ట్రైలో ఆపిల్ ముక్కలు వారికి అందిస్తూ.
“మంచివారి ఇంట్లో మంచివారు అద్దెకుంటున్నారు, ఎంత సంతోషింపదగ్గ విషయం,” అంది యశో.
‘‘ఇప్పుడు ఈ ఇంటి యజమాని వారి ఏకైక పుత్రుడు, ఆయన చాలా సౌమ్యుడని వినికిడి. అయితే మేమెప్పుడూ ఆయన్ని చూడలేదు. ఇక్కడ వాళ్ల బాబాయ్ వున్నారు. వారు చెప్పగా విన్నాను, ఆయన చిన్నతనంలో ఎవరినో ప్రేమించారట. ఆవిడ చనిపోవటంతో ఆయన ఇల్లు వదిలి దేశ సంచారం చేస్తూన్నారట.. పాపం ఎంత విషాధగాధ,’’ అంది.
ఆ మాటలు వింటూంటే యశో కళ్లు నీళ్లు చెమర్చాయి.
‘‘అవును చెల్లీ,’’ అంది.
“ఇక మీగురించి చెప్పండి అక్కా,“ అంది సురేఖ కుతూహలంగా.
‘‘మా గురించి చెప్పటానికి పెద్దగా ఏమీ లేదు చెల్లీ మా విచిత్ర దాంపత్యం తప్ప,” అంది యశో నవ్వుతూ
‘‘అదేమిటో చెప్ప్పుఅక్కా, బావగారికి అభ్యంతరం లేక పొతే,” అందిసురేఖ కూడా నవ్వుతూ.
"అది వినడానికి నువ్వింకా చిన్నపిల్లవి చెల్లీ, తరవాత తప్పక చెపుతాను," అంది యశో
"ఆలా అంటావేమిటి అక్కా, మా తాత నాకు పెళ్లి చేద్దామని తాహతహ లాడుతుంటే," అంది సురేఖ.
“ఎంత వరకు వచ్చింది వరుడి వేట?” అడిగింది యశో.
“మా తాత కాళ్ళు కట్నం ఉచ్చులో చిక్కుకున్నాయి అక్కా . పాపం ఆయన మాత్రం అంతంత కట్నాలు ఎక్కడి నుంచీ తేగలడు, అదీకాక నాకు అన్నదమ్ములు అక్కచెల్లులు లేరు, చిన్నతనం నుంచీ ఈయనే పెంచాడు," అంది దిగులుగా సురేఖ.
సురేఖ అప్యాయత అమాయకత్వం యశో హృదయాన్ని పూర్తిగా కదలించేయి.
‘‘నీకు నచ్చిన వాడు ఎవరూ లేరా చెల్లీ?’’ అంది.
సురేఖ కాస్త సిగ్గుపడింది చెప్పడానికి.
‘‘ఫర్వాలేదుమ్మా చెప్పు, అక్క బావలవద్ద నీకు సంకోచం ఎందుకు,’’ అంది యశో సురేఖ చేయి తీసుగుని.
‘‘మధు వున్నాడు. చాలా మంచివాడు. తన తల్లిదండ్రులు పేరుకైనా కట్నం లేకపోతే చేసుకోవటానికి వీలు లేదంటున్నారు. మధు ఎక్కడికైనా వెళ్లిపోదామంటున్నాడు. తాతయ్యని వదలి ఎలా వెళ్లను చెప్పు,” సురేఖ సిగ్గుపడుతూనే అంది.
అప్పుడు నాకు లఖియా మేనకోడలు సుజాత జ్ఞాపకానికొచ్చింది. సురేఖ జీవితం కూడా అదే బాట లో నడుస్తుందా?
‘‘నువ్వేమీ చింతపడకు చెల్లీ. మధు తలిదండ్రులు ఎంత కట్నం కావాలంటారు చెప్పు,’’ అంది యశో.
‘‘లాభం లేదు అక్కా; కనీసం రెండువేలైనా కావాలంటున్నారు,’’ అంది సురేఖ నిరాశతో.
‘‘నీకేమీ ఫర్వాలేదు, రేపే మధూతో చెప్పు, మీ అక్కయ్య నీ కట్నం ఏర్పాటు చేస్తుందని. ఆ రెండు వేలు నీకు త్వరలో అందేటట్లు చేస్తాను . నువ్వేమీ అడ్డుచెప్పుకు చెల్లీ; ఇది అక్కయ్య అభిలాష,’’ అంది యశో ఎంతో ధీమాగా.
‘‘నువ్వు నిజంగా మానవ మాత్రురాలివి కాదు అక్కయ్యా! దేవతలే మీ రూపంలో వచ్చి నన్ను ఆదు కుంటున్నారనిపిస్తోంది. ఇంత అందంగా మానవులుండరు,’’ అంది సురేఖ యశోని కౌగిలించుకుని.
‘‘అలాంటి అనుమానాలు పడకు చెల్లీ. మేము కూడా నీబోటి వాళ్లమే నా దగ్గర కాస్త డబ్బుంది, అందులో కాస్త చెల్లెలికి కట్నంగా ఇస్తాను అంతే’’ అంది యశో నవ్వుతూ.
“తప్పు పట్టవు కదా, నీ అడ్రెస్ అడగచ్చా అక్కా?” అంది సురేఖకి ఇంకా నమ్మకం కుదరక.
“పేపరూ పెన్ తీసుకురా, నీ బావగారు రాసిస్తారు,” అంది యశో.
"బావ గారూ, నా డైరీలో రాద్దురుగాని లోపలికి వెళదాం, మీరూ ఇల్లు చూసినట్టు ఉంటుంది," అంది సురేఖ.
మేము ఎడమవైపు గదిలోకి వచ్చినప్పుడు మెల్లగా యశోచెవిలో చెప్పాను, నేను అక్కడే పుట్టానని, యశో నా ముఖం కేసి చూసి చెయ్యి గట్టిగా పట్టుకుంది.
సురేఖ రెండు మంచాలు తెచ్చి పక్కలు వేసింది. చాలాసేపటివరకు అనేక కబుర్లు చెప్పింది. మధు ఆ ఊరిలో అందరికంటె అందంగా వుంటాడట. కాలేజీలో బీఎస్సీ చదువుతున్నాడు. ఒకసారి లంఖించిన ఆంబోతు తరుముతూవుంటే అడ్డువెళ్లి చెయ్యి విరక్కొట్టుకున్నాడు
"బావగారూ, అక్కయ్యకు చూపించడానికి మనిద్దరం మధుని తీసుకొద్దాం, ఏమంటారు? అంది
ఎంత అమాయకురాలు ఈ సురేఖ?
మేము పక్క లెక్కే సరికి పన్నెండయింది. ఎంత విచిత్రం నా ఇంట్లో నేను అతిథిగా పడుకున్నాను, పూర్వకాలంలో ఇది మా నాన్నగారి ఆఫీసు గది. ఒక వైపు, నా మనసంతా పాత జ్ఞపకాలతో నిండిపోగా, మరొకవైపు నా మెదడంతా పరిపరి ఆలోచనలతో కలవర పడింది. అదే కాక బాగా నిద్రపట్టి తెల్లవారకట్ల మెలకువ రాకపోతే మాగుట్టు రచ్చకెక్కుతుందన్న భయం. ముసలాయన లేపుతా నన్నాడు కానీ ఏం చెప్పగల. ఏమయితేనేం, ఒక్క కునుకు కూడా తీయలేక పోయాను.
కాని, పక్క మంచమ్మీద యశో ప్రశాంతంగా నిద్రపోయింది. ఎంత సంతోష స్వభావం ఈమెది , నేను పెళ్లి చేసుకోక పోయినా, ఇది తన అత్తవారిల్లులా తలచి ఎంత తృప్తి పొందుతోంది. అయినా తన్ని ఇంకా ఎందుకు భార్యగా స్వీకరించ లేకపోతున్నాను. హే విధీ, సుశీ స్మ్రుతి యశో ఆత్మకే శాపం అయింది. తానే కావాలనుకుంటే రెచ్చగొట్టి నన్నుపొందవచ్చును, అయినా ఆ అవకాశం వున్నా దాన్ని దుర్వినియోగ పరచుకోదు,అదే నిదర్శనం ఆమె వ్యక్తిత్వ ఔచిత్యం, జీవన ఔన్నిత్యానికి . కాని నేను, ఆమె అందచందాలు అడవిగాచిన వెనన్నెలవుతున్నా చీమకుట్టనట్టు కూర్చుంటున్నాను. తనయవ్వనం వ్యర్ధపరుస్తుంటే నేనామె సేవలో కులుకుతున్నానంటే నేనెంత స్వార్ధపరుడ్ని. ఆలా పరిపరివిధాలఆలోచిస్తూ యశోని చూస్తూ రాత్రంతా గడిపాను.
తెల్లవారక నాలుగు గంటలకి యశోని నిద్ర లేపుతుంటే సురేఖ తాతగారు వచ్చారు. గాబ గబా తయారయ్యి మేము వెళ్ళబోయేముందు, యశో ఆయనకి పాదాభివందనం చేస్తే, 'శ్రీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు' అని దీవించారు. ఆ ఆశీర్వాదం యశోకి ఆనంద దాయకమయితే అది నా హృదయభారాన్ని మరింత పెంచింది.
డబ్బు తప్పకుండా పంపుతానని యశో సురేఖకు మళ్ళీ మాట ఇచ్చింది.
‘‘బావగారూ. అక్కయ్యనిజాగ్రత్తగాచూసుకోండి,’’ గడపదాటేక వెనకనించి సురేఖ నన్నుహెచ్చరించింది,
ఆనాడు రణధీర్ కూడా అలాగే చెప్పాడు. అతడు యశో తమ్ముడు ఈమె చెల్లెలు.
హుటాహుటిని స్టేషన్ చేరేము. ఆ రాత్రి తనకు పట్టినంత గాఢనిద్ర యిదివరకెప్పుడూ పట్టలేదంది. ఆ రాత్రి తన ఇంటిలో గడిపినందుకు ఎంతో మనశ్శాంతి లభించిందంది. సురేఖ లాంటి చెల్లెలు తనకు దొరికినందుకు చాలా సంతోషంగా వుందంది. మేము అన్నవరం, సింహాచలం, పూరి వగైరాలు తిరిగి ఇంటికి చేరుకునేటప్పటికి సురేఖ సందేశంతో కూడిన అమె పెండ్లి శుభలేఖ స్వాగతం పలి కింది.
“ఈ శుభకార్యము నీ దయవల్లనే అవుతూవుంది అక్కయ్యా, నువ్వు రాకపోతే ఆ వెలితి తీరదు. మధుకూడా ఇదే అంటున్నాడు. పెళ్లి అయిన తర్వాత బావగారికి నీకు మేమిద్దరమూ నమస్కరిస్తాము అక్కా. నీవు రావాలి, నాకు అమ్మలేదు, ఇంకెవరూ లేరు. నువ్వు వచ్చావంటే ఆ లోటులన్నీ తీరుతాయి. రాకపోతే పెళ్లిరాత్రి నేను ఏడుస్తూ కూర్చుంటాను. చెల్లి వివాహం నీవు చూడకపోతే ఇంకెవరు చూస్తారు. అక్కా తప్పక రావాలి. బావగారికి నా నమస్కారాలు.’’
ఉత్తరం పట్టుకుని ఏడుస్తూ కూర్చుంది యశో. ఏ మాత్రం వాత్సల్యం చూపినా ఈమె గుండె కరగిపోతుంది. ఇక చేసేదేముంది? పది రోజులక్రితం వచ్చిన ఉత్తరం ఇది. పాపం ఎంత బాధపడిందో అక్కయ్య రాలేదని, చివరికి ఉత్తరమైనా రాకపోతే నిజంగా దేవతలే అలా వచ్చారనుకుందేమో.
"మీరు వెంటనే తనకి టెలిగ్రాం ఇచ్చి ఒక మంచి బనారస్ సిల్క్ చీర పంపించి రండి
నేనీ లోపున ఉత్తారం రాస్తాను. మీ చీరల ఎంపిక గురించి వేరేచెప్పలాండి," అంది యశో నవ్వుతూ.
"మరదలు పిల్లతో పాటు తన అక్కకు కూడా ఒక చీర కొంటాను, ఏమాంటావు?" అని, యశో నగుమోము వీక్షిస్తూ, ‘బాటా’ చెప్పుల్లో కాళ్ళు దూర్చాను.
చాప్టర్ 29
ప్రయాణ బడలిక తీర్థయాత్రలు విసుగూ ఇంకా తీరక ఆమరునాటి మధ్యాహ్నం నేను నిద్ర పోతుంటే. యశో గదిలోకి ‘‘బాదల్ బా బూ. బాదల్ బాబూ’’ అంటూ అరచినట్లుగా వచ్చింది.
‘‘ఏమిటి సుందరీ, ఏమైంది ?’’ అన్నాను నిద్రమత్తు ఇంకా వదలలేదు.
‘‘ఇంకెప్పుడూ అలాగా అలా పిలవకండి,‘‘అంది తను చెవులు మూసుకుని.
నేను ఆశ్చర్యపోయాను. సుందరీ అనే పేరు తనకు నచ్చిందని ఆమే ఒక సారి చెప్పింది. పరిహాసమేమో అనుకున్నాను. ముఖం చూస్తే వెలవెల పోయింది . తన చేతిలో ఉత్తరం నా నా పక్క మీద పెట్టి తిరిగిచూడకుండా వెళ్ళిపోయింది కన్నీళ్లు తుడుచుకుంటూ . తీరా చూస్తే అది సరళ రాసింది. వణికే చేతులతో దాన్ని చదవటం ప్రారంభించాను.
‘‘ప్రియమైన యశోకి,
నా సంగతి తర్వాత చెప్తాను. మొదట లఖియా విషయం చెప్పనీ, ఎలాచెప్పేది? ఆ విషయం తలచుకుంటూంటే హృదయం పగిలిపోతూంది. ఆమె కథ విని, నువ్వు ఒకసారి అన్నావు, ‘కష్టాలు ఓరిమితో సహించే వాళ్లనే సమాజం, చివరకు దైవం కష్టపెడతాడని’. అది ఎంత యదార్థమైందో యిప్పుడు అర్ధమయింది నాకు , అసలు సంగతి చెప్పకుండా నిన్నీ ఉపోద్ఘాతం తో వేధిస్తున్నా ననుకుంటాను.
“నేను తరచుగా లఖియాని కలుస్తూవుంటాను. నువ్వు ఆమెకు రాసిన ఉత్తరాలు నాకు ఎప్పటికప్పుడు చూపిస్తుంది. (ఎక్కడున్నా ఉత్తరం రాస్తావని చెప్పావు కానీ ఎప్పుడూ రాయలేదు. నీ పక్షపాత వైఖరిని తర్వాత ఓ పట్టుపడటాలే)
కాని మొన్న నీ పూర్వాశ్రమానికెళితే అక్కడ నాకు మతి భ్రమించినంత పని అయ్యింది.
అప్పటికి వారం రోజుల క్రితం లఖియా గురువుగారిని తీవ్రంగా గాయపరచిందన్న అభియోగంమీద ఆమెని పోలీసులు రిమాండ్ లోకి తీసుగున్నారు. ఆ ఘోర సంఘటన లఖియా కుటీరంలో జరిగిందట. తలమీద ఆయన్ని ఒక ఇనుప దండెంతో కొట్టిందట. తల పగిలి ఆయన ఇంకా స్పహలేకుండా ఆస్పత్రిలోనే వున్నాడట. ఆ గాయానికి కారకురాలు తనే అని చెప్పి,, తను ఆ నేరాన్ని ఒప్పుకుందిట. పోలీసుల కారణమడుగుతే ‘నా వైధవ్యాన్ని కాపాడుకునేందుకు ఆ పని చేయాల్సి వచ్చింది’ అని చెప్పిందట. ఇంకెన్ని ప్రశ్నలడిగినా జవాబు చెప్పలేదట. లఖియా ఎలాంటి పరిస్థితుల్లో అలాంటి పని చేసిందో మనం సులభంగానే గ్రహించ గలం. అయినా నాకు మొదటి నుంచీ మీ గుగ్గురువు మీద అనుమానంగానే ఉండేది, అయినా లఖియా కి నీకు చెప్పడానికి సంకోచించాను. ఇంతకీ ఇక్కడ గమనించదగ్గ విషమేమిటంటే, రణధీర్ ఆరాత్రే ఆశ్రమం వదిలి వెళ్లిపోయాడుట.
వెంటన్ రాజేంద్ర నేను తన్ని డెహ్రాడూన్ జైలులో కలిశాము. వివరాలు చెప్పమని ఎంతో వేడుకున్నాను. దుఃఖము పట్టలేక తలను గోడకేసి కొట్టుకున్నాను. ‘‘సరళా. ఆ వివరాలు తెలుసుకుని నీవు చేసేదేముంది? ఆ నేరం చేసింది నేనే. దానికి శిక్ష అనుభవించాల్సిందే, నాకు ఏమి శిక్ష వేసినా చింతలేదు. దీనిని సులభంగానే దాటివేస్తాను. ఆ తర్వాత భగవంతుని ముందు నిలబడి నేనేమి చెప్పుకోగలను? ఆ విషయమే నన్ను బాధపెడుతూంది’’ అంది కాని ఇంకేమీ చెప్పలేదు.
మేము లాయర్ని కుదురుస్తామంటే ససేమిరా అంటోంది లాఖియా. అయినా ఈ ఊరిలోని ఒక మంచి లాయరుతోటి మాట్లాడేడు రాజేంద్ర. ఆత్మసంరక్షణ కోసం చేసిన నేరం గనుక శిక్షపడకుండా ప్రయత్నించవచ్చు నన్నాడతను. ఇదే విషయం నేను లఖియాకు చెపితే నామీద మండి పడింది. నేనీ ప్రయత్నం మానుకోకపోతే లాయర్ ముఖమే కాదు, నాముఖం కూడా చూడనని నిక్కచ్చిగా చెప్పింది. నా అనుమానమేమిటంటే, తన్ని కాపాడ్డానికి రణధీరే ఆ అఘాయిత్యం చేసి ఉంటాడు. అప్పుడు క్రుతజ్ఞతాభావంతో ఆ నేరం తనమీద మోపుకుంది కానీ ఇప్పుడు లాయర్ కచేరీలో డొంక కదిలిస్తే రణధీర్ బటపడతాడని తను భయపడుతోందనుకుంటున్నాను. మనకు తెలుసు ఇది కేవలం మూర్ఖత్వం అని, కానీ తనకి ఆ విషయం చెప్పేదెవరు? బహుశా రామంబాబు. ఈ ఉత్తరం చూసిన మరుక్షణమే మీరిద్దరూ బయలుదేరి వస్తారని నాకు తెలుసు. మీ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాము.
ఇదంతా చెప్పిన తర్వాత నా గురించి ఏమీ చెప్పబుద్ది వెయ్యటంలేదు. నా కొడుకుక్కి మొన్ననే ఏడాది నిండింది. పేరు ‘రామం బాబూ’, ఆయనకు నామాట గా చెప్పు, ‘బాదల్ బాబూ కంగారుపడక గుర్తు తెచ్చుకో, మా బాబుకి గాడ్ ఫాథర్ అవుతానని ఒక సారి మాట ఇచ్చావు’. ఏమిటో, జీవితంలో అనుకున్నవన్నీ జరగవు. లఖియా సంగతి విని మీరు చాలా దు.ఖపడతారు ఆమెకి ఎవరిని చూడాలనీ లేదంటుంది. అయినా మిమ్మల్ని చూస్తే కాస్త మనశ్శాంతి లభిస్తుందామెకు. ఎప్పుడు వచ్చేది వైర్ చేయండి.’’
ఆ ఉత్తరం ఎలా చదివానో నాకే తెలియదు. అది పట్టుకుని అలాగే కూర్చుండిపోయాను. పిడుగులాంటి ఆ వార్త విని స్తంభించిపోయాను.
లఖియామీద దైవానికి ఎందుకింత కక్ష? అడుగడుగునా అందరూ ఈమెని ఎందుకిలా వెంటాడుతున్నారు? మొదట కట్టుకున్న భర్త, తర్వాత మామయ్య, ఆ తర్వాత గురువు, వీరందరినీ ఎందుకు పురిగొల్పాడు ఆ దేవుడు.
లఖియాని నేను ఒకసారి క్షమా భిక్ష యాచించాను. ‘‘మానవుడు నీకు చేయాల్సిన సహాయమేమైనా వుంటే నువ్వు అడుగాల్సిన మొదటి వ్యక్తిని నేనే’’ అని, అలాంటి అవకాశం లభించినప్పుడు నేనే ఏమీ చేయలేకపోయాను. ఆమె పిలుపుకి అందని చోట్ల ప్రేయసి వెంట తిరుగుతున్నాను. ప్రపంచంలో నా అనే వాళ్లు లేని ఈ అసహాయ స్త్రీ మీద సానుభూతితో నా హృదయం పెల్లుబికింది. సరళ మొదటి నుంచీ లఖియాకు ఎంతో సహాయం చేసింది. ఈసారి కూడా ఆమే చేయగలిగింది. సరళలో ఎన్ని దోషాలున్నా వాటినన్నింటినీ ఇది కడిగివేస్తుంది. అప్పటి నుంచి సరళ మీద నా అభిప్రాయం మార్చుగున్నాను. మూలుగా మనం చూసే స్త్రీలలా కోరికలనీ, అభిప్రాయాలనీ అణగదొక్కి బయటకి నవ్వుతూ ఆమె ప్రవర్తించదు. ఎవరన్నా భయం లేదు ఆమెకి. తన అభిప్రాయాలని నిష్కర్షగా చెప్పుతుంది. అగ్నిలాంటి హృదయ మామెది. లోపాల్ని కప్పిపుచ్చదు. అన్యాయాన్ని సహించదు ఇలాంటి వ్యక్తి కనుకే లఖియాకి ఆమె సహాయం చేయ పూనుకుంది.
ఈ సంఘటన నుంచీ లఖియా ఆలోచనలు ఏ విధంగా సాగుతున్నాయి? పూర్వపు చిరునవ్వు అంతర్గతంలోని వెలుగు మాయ మయ్యాయా? ఆమెచేత దెబ్బ కొట్టించింది ఆ భగవంతుడే అందుకు సందేహం లేదు, తనను రక్షించుకోవటానికి చేతికందిన దానితో కొట్టి వుంటుంది. ఆ దెబ్బ తలమీదే తగలాలా? ఇలా ఆలోచిస్తూంటే హఠాత్తుగా ఒక ఆలోచన తట్టింది. అసలు ఆ దెబ్బ లఖియా కొట్టలేదేమో. రణధీర్ ఆరాత్రే ఆశ్రమం వదలిపెట్టాడని సరళ రాసింది. ఆమెను రక్షించటానికి అతను కొట్టాడేమో? రణధీర్ని రక్షించటానికి లఖియా బతిమాలో ,ఆత్మహత్యచేసుకుంటానని భయపెట్టో అతన్ని పంపించి వేసిందేమో? అందరి తప్పులూ, దోషాలూ తననెత్తిన వేసుకోవడం లఖియాకి వాడుకే గాదా!
అయినా, పురుషుల దుష్ప్రవర్తన మీద అంత అవగాహన ఉన్న లఖియా ఆ దొంగ సన్యాసి నైజం గ్రహించడంలో ఎలా విఫలమయింది? ఆమాటకొస్తే అంత గడుగ్గాయి అయికూడా యశో ఎందుకు తెలుసుకొని లేకపోయింది! యశో చెవులు మూసుకుని తనను ‘సుందరీ’ అని ఎందుకు పిలవద్దందో నాకు అప్పుడు అర్థమైంది. యశో నాకు రాసిన ఉత్తరంలో ఆశ్రమంలోని సన్యాసుల సౌంధర్యారాధన నిష్కల్మషమైనదనీ, ఇతరులకు హాని చెయ్యదని రాసింది. అదే దృష్టితో గురువుగారి నోటినుండి ‘సుందరి’ అన్న పిలుపు సహించింది. ఎందుకో మొదటి నుంచీ అతడిమీద ఆమెకు భక్తి, భయమూ ఏర్పడ్డాయి. అతగాడి మాట విని నన్ను కూడా వదలుకోవటానికి సిద్ధపడింది. లఖియాయే వుండిపోయింది. చివరకు ఇలా జరిగింది. ఈ వార్త యశోకు ఎంత
Comments (0)